ఖేడ్‌లో ఔటర్ రింగ్‌రోడ్డు
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా రింగ్‌రోడ్డుతోపాటు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. పట్టణం సమీపంలోని కాంజీపూర్ రోడ్డు నుంచి నిజాంపేట–నారాయణఖేడ్–బీదర్ జాతీయ రహదారి వరకు నిర్మిస్తున్న రింగురోడ్డు పనులకు పట్టణ శివారులోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటాపూర్ సమీపం నుంచి ఔటర్ రింగురోడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో రహదారులనూ విస్తరిస్తామని చెప్పారు. 40 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న రింగురోడ్డుకు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్లు వివేకానంద్, రాజేష్ చౌహాన్, మాజిద్, రామకృష్ణ, రమేష్ చౌహాన్, తాహెర్‌అలీ, వీరన్న, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యే ఖేడ్‌లోని తన స్వగృహంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ మల్లేశం, మాజీ ఎంపీటీసీ పండరిరెడ్డి, నాయకులు రాధాకిషన్, మాణిక్ గౌడ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నిర్మాణ పనులకు భూమి పూజ
Comments
Please login to add a commentAdd a comment