లొట్టపీసు కేసు అంటూ అవమాన పరుస్తారా?
నర్సాపూర్ రూరల్, మనోహరాబాద్(తూప్రాన్): లొట్టపీసు కేసు అంటూ మాజీమంత్రి కేటీఆర్.. సీబీఐ, పోలీసులను అవమాన పరుస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. మరి కేసు విచారణకు న్యాయవాదులను ఎందుకు తీసుకెళ్లినట్లు అని ప్రశ్నించారు. మంగళవారం నర్సాపూర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో, మనోహరాబాద్ మండల పీహెచ్‌సీకి మంజూరైన 108 అంబులెన్స్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేటీఆర్ సీబీఐ, పోలీసులను అవమానపరిచారని ఆరోపించారు. కేటీఆర్ ఈ ఫార్ములా ఆరోపణలు మొదలైనప్పటి నుంచి లొట్ట పీసు కేసుకు ఉదయం వెళ్లి సాయంత్రం వస్తామని చెప్పి.. ఇప్పుడేమో న్యాయవాదులను వెంటబెట్టుకుని విచారణకు హాజరు కావడం విడ్డూరంగా ఉందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తాను మల్లన్న సాగర్ కు వెళుతుంటే పోలీసులతో అరెస్టు చేయించారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులకు అధికారం పోయి 13 నెలలు గడుస్తున్నా అహంకారం మాత్రం తగ్గలేదన్నారు. కాగా, దొంగ చాటుగా తాను లేనప్పుడు బీజేపీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.. బీజేపీ నాయకులపై దాడులు చేయడం విచారకరమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతీఒక్కరికి మాట్లాడే హక్కు ఉందని దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప దాడులు చేయడం సబబు కాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు బాధ్యతలు ఇస్తారని తెలిసిందని విలేకరులు ప్రశ్నించగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ కృషి అభినందనీయం
కౌడిపల్లి(నర్సాపూర్): ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ బాలకృష్ణారావు బ్రదర్స్ సేవలు అభినందనీయమని ఎంపీ రఘనందన్ తెలిపారు. మంగళవారం కంచన్‌పల్లి వాసి బాలకృష్ణారావు బ్రదర్స్ రూ.60లక్షలతో పాఠశాలకు ప్రహరీ, 2 అదనపు గదులు, టాయిలెట్స్ నిర్మాణం కోసం ముందుకురావడం అభినందనీయమన్నారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.
మరి విచారణకు న్యాయవాదులుఎందుకు?
కేటీఆర్ తీరుపై ఎంపీ రఘునందర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment