వెలిమెలతండాలో ఉద్రిక్తత
రామచంద్రాపురం (పటాన్‌చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉన్న వెలిమెల తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొందరు జేసీబీలను వెంటబెట్టుకొని వచ్చి భూమిలో ప్రహరీ నిర్మాణానికి తవ్వుకాలు చేపడుతుండగా గిరిజన మహిళలు, రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బీడీఎల్ సీఐ స్వామి ఘటన స్థలానికి చేరుకొని పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాము అనేక ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని పోలీసులతో ఆందోళనకారులు అన్నారు. కొంతమంది అధికారులు సర్వే చేయని భూములను ఇతరులకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. దీంతో కొంతసేపు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. భూమి విషయంపై కొద్దిరోజులుగా ఆందోళన సైతం చేస్తున్నట్టు తెలిపారు. రెండు రో జుల క్రితం కూడా కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయా లని కోరామన్నారు. ఆ భూమి తమకే వచ్చేలా ప్రభు త్వం, అధికారులు కృషి చేయాలని విన్నవించారు. కాగా రాత్రి వరకు గిరిజన మహిళలు, రైతులు ఇక్కడే బైఠాయించారు.
ప్రహరీ నిర్మాణ తవ్వకాలను అడ్డుకున్న మహిళలు, రైతులు
సర్వే చేయని భూములకు రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆందోళన
రాత్రి వరకు బైఠాయింపు
Comments
Please login to add a commentAdd a comment