రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
డీఎస్పీ సత్తయ్య
సంగారెడ్డి టౌన్ : వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య అన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాహనచోదకులు కచ్చితంగా రోడ్డు నియమాలను పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకొని ప్రయాణించాలన్నారు. ప్రయాణం చేసేటప్పుడు మార్జిన్ గమనిస్తూ చేసుకుంటూ వాహనాలను నడపాలన్నారు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ప్రభులత, సంగారెడ్డి టౌన్ సీఐ రమేశ్, డిపో మేనేజర్ ఉపేందర్, డిపో అధికారులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment