టీ హబ్ సేవలు భేష్: ఎన్‌హెచ్‌ఎం బృందం
సంగారెడ్డి/రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అసంక్రమిత వ్యాధులపై జాతీయ వర్క్‌షాప్‌లో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జాతీయ ఆరోగ్య వైద్యాధికారుల (ఎన్‌ఎచ్‌ఎం) అధికారుల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 40మంది నాలుగు బృందాలు ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వివిధ విభాగాల సేవలను పరిశీలించింది. ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్, పాలియేటివ్ కేర్, టీహబ్ లను పరిశీలించి ఇక్కడ అమలవుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకుంది. టీహబ్ సేవలు బాగున్నాయని, తమ తమ రాష్ట్రాల్లో ఇలాంటి సేవలు అందించేలా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వనున్నట్లు కేంద్ర బృందంలోని సభ్యులు తెలిపారు. బృందం వెంట (డీఎంఈ) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి, డీఎంఎచ్‌వో గాయత్రి దేవి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
రామచంద్రాపురం, తెల్లాపూర్ పీహెచ్‌సీలను..
రామచంద్రాపురం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ), తెల్లాపూర్ పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ను బుధవారం కేంద్ర వైద్య బృందం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మందులను ఏవిధంగా అందిస్తున్నారు అనే విషయంపై ఆరా తీశారు. వారి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్‌ను పరిశీలించారు. ఈ కేంద్ర వైద్య బృందంలో డాక్టర్.బృంద, డాక్టర్.భానుప్రతాప్ సింగ్, డాక్టర్. జయేశ్ సోలంకి, డాక్టర్.నిషాద్‌ఖాన్, డాక్టర్.సుభ్రాన్సు శేఖర్ దత్త, డాక్టర్. అలెమ్వాబాంగ్ ఎయిర్‌తోపాటు స్థానిక వైద్యాధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఆసుపత్రి సందర్శన
వివిధ విభాగాల సేవలు పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment