పోటీ పడి రుణాలు అందించాలి
సంగారెడ్డి జోన్: సహకార బ్యాంకులు నూతన రుణాలు అందజేయాలని కమర్షియల్ బ్యాంకులతో పోటీపడి రైతులకు సేవలు అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు. 2025–26 ఏడాదికి పంట రుణాల జారీకి వివిధ వ్యవసాయ ఉద్యాన పంటలకు వాస్తవిక రుణస్థాయిని నిర్ణయించడం, రికవరీకి గడువు తేదీని ఖరారు చేయడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు రుణాలివ్వడంతో పాటు వారి నుంచి డిపాజిట్ల సేకరణ కూడా జరపాలన్నారు.
జాబ్ మేళాకు విశేష స్పందన
జిల్లాలోని వివిధ కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలలో వారి అర్హతల మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. బుధవారం జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి కల్పన శాఖ మహిళా శిశు వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్తంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన 156 మంది హాజరయ్యారు. 200 ఉద్యోగాలను క ల్పించేందుకు 32 కంపెనీలు ముందుకు వచ్చాయి.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment