స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలి

Published Thu, Oct 24 2024 7:34 AM | Last Updated on Thu, Oct 24 2024 7:34 AM

స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలి

స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలి

● కలెక్టర్‌ మనుచౌదరి ● స్వశక్తి మహిళల టైలరింగ్‌, క్లాత్‌ బ్యాగ్స్‌ పరిశీలన

హుస్నాబాద్‌రూరల్‌: స్వశక్తి మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక ప్రగతిని సాధించాలని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. బుధవారం పోతారం(ఎస్‌)లోని స్వశక్తి మహిళల టైలరింగ్‌ యూనిట్‌, క్లాత్‌ బ్యాగ్‌ యూనిట్స్‌ను పరిశీలించారు. మహిళలు తయారు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, లాభల గురించి అరా తీశారు. స్వయం ఉపాధితో లాభాలను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థిక పెట్టుబడుల కోసం రుణాలను అందిస్తామని దానికి కావాల్సిన ప్రతిపాదనలను ఐకేపీ అధికారులు చూసుకోవాలని సూచించారు. ఇదే మాదిరిగా మిగతా గ్రామాల్లో స్వశక్తి సంఘాల మహిళలు యూనిట్స్‌ నెలకొల్పడానికి ముందుకు వచ్చే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. మహిళలు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్‌ సౌకర్యం అధికారులు చూపించాలన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి

హుస్నాబాద్‌: ప్రయోగాత్మక విద్య ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. బుధవారం హుస్నాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను కలెక్టర్‌ సందర్శించి సైన్స్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ల్యాబ్‌లలో అన్ని అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని ఉపయోగించి పాఠ్యాంశాలకు అనుగుణంగా విద్యార్థులకు భోదన చేయాలని సూచించారు.

రహదారి పనులు వేగిరం చేయండి

సిద్దిపేటరూరల్‌: జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో రెవెన్యూ, నేషనల్‌ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సిద్దిపేట– సిరిసిల్ల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి, సకాలంలో భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మెదక్‌– ఎల్కతుర్తి జాతీయ రహదారిలో భాగంగా మెదక్‌ – సిద్దిపేట మధ్య నిర్మాణం పూర్తికాని ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, నేషనల్‌ హైవే ఈఈ బలరామకృష్ణయ్య, సంబంధిత తహసీల్దార్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement