చేపల ఉత్పత్తిని పెంచాలి..
● అవగాహనా పెరగాలి ● జిల్లా మత్స్యశాఖాధికారి వరదారెడ్డి ● కళాశాలలో ఘనంగా చేపల దినోత్సవం
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిని అధికం చేయాల్సిన అవసరం ఉందని జిల్లా మత్స్య అభివృద్ధి శాఖాధికారి వరదారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో గురువారం వరల్డ్ ఫిషరీస్‌డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపల ఉత్పత్తిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా చేపలలో వచ్చే సీజనల్ వ్యాధులు–నివారణ, చేపల విత్తనోత్పత్తి, ఆహారఉత్పత్తి, చేపలలోని ఆహార విలువలు, వాటి వల్ల లాభాలు తదితర అంశాలపై ఫిషరీస్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ కళాశాలలో ఫిషరీస్ విద్యార్థులు ప్రయోగాలు చేస్తూ చక్కగా విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన అక్వేరియంలను సందర్శించి వారిని అభినందించారు. అంతకుముందు నీటి కొలనులో చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో జంతు, మత్స్యశాస్త్ర విభాగాల అధిపతి డాక్టర్ అయోధ్యరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ గోపాలసుదర్శనం, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment