కేసీఆర్ పోరాట స్ఫూర్తి దీక్షా దివస్
సిద్దిపేటజోన్: తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పిన దీక్షా దివస్ కేసీఆర్ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. ఈనెల 29న దీక్షా దివస్ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాదకిషన్‌శర్మతో కలిసి ఆయన మాట్లాడారు. 29న దీక్షా దివస్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తునట్లు తెలిపారు. వేడుకలకు ఎమ్మెల్యే హరీశ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. వేడుకలకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, వివక్షకు వ్యతిరేకంగా కేసీఆర్ మలి దశ ఉద్యమాన్ని చేపట్టారన్నారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని సిద్దిపేట గడ్డ వేదికగా కేసీఆర్ ఆమరణ దీక్షకు పిలుపు ఇవ్వడం, తదుపరి పరిణామాల నేపథ్యంలో దీక్షా దివస్ చరిత్రలోనే నిలిచిపోయిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయి దిగజారి విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, నాయకులు శ్రీనివాస్, మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 29న అట్టహాసంగా వేడుకలు
పెద్ద ఎత్తున శ్రేణులు తరలిరావాలి
ఎమ్మెల్సీ యాదవరెడ్డి పిలుపు
Comments
Please login to add a commentAdd a comment