ఎనగుర్తిలో కొత్త రాతియుగం నాటి ఆనవాళ్లు
● బండపై ఆది మానవులుతయారు చేసుకున్న పనిముట్ల గుర్తులు ● క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల నాటి పునరావాస ఆనవాళ్లు ● చరిత్ర పరిశోధకుల అన్వేషణలో వెలుగులోకి..
దుబ్బాక : దుబ్బాక మండలం ఎనగుర్తిలో కొత్తరాతి యుగం నాటి ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఇటీవలె చరిత్ర పరిశోధకుల అన్వేషణలో ఎనగుర్తిలో కాశీ విశ్వనాథస్వామి ఆలయం సమీపంలో బండల మీద పురమానవుల ఆనవాళ్లు భయడపడటం విశేషం. ఎతైన గుట్ట మీద పెద్ద బండరాయిలపై పుర మానవులు తమ ఆహార సేకరణలో భాగంగా ఉపయోగించే రాతి పనిముట్లు (రాతి గొడ్డళ్లు) నూరుకున్న గుంతలను (గ్రూవ్స్) దాదాపు 20కి పైగా ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు గుర్తించారు. ఈ ఆనవాళ్లను బట్టి ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 5 వేల ఏళ్ల కిందట నాటి ఆదిమ మానవులు నివసించినట్లు చరిత్ర పరిశోధకులు తెలిపారు. ఎనగుర్తితోపాటు జిల్లాలోని సిద్దిపేట, నంగునూర్, నర్మెట్ట, వీరారెడ్డిపల్లిల్లోనూ ఆదిమ మానవుల ఆనవాళ్లు ఇది వరకే గుర్తించారు. తాజాగా ఎనగుర్తిలో వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇంకా లోతుగా పరిశోధిస్తున్నట్లు చరిత్ర పరిశోధకులు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment