శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట
● సీపీ అనురాధ ● సిద్దిపేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్
సిద్దిపేటకమాన్: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడం ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశ్యమని సీపీ అనురాధ తెలిపారు. సిద్దిపేట పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్‌ను బస్టాండ్ చౌరస్తా వద్ద ఏసీపీ మధు, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్‌లతో కలిసి సీపీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఆర్‌ఏఎఫ్ సిద్దిపేటకు రావడం జరిగిందన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు పోలీసు అధికారులతో కలిసి బందోబస్తు నిర్వహించి, ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ, మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20న హుస్నాబాద్ పట్టణం, 21న గజ్వేల్ పట్టణంలో, 22న కొమురవెల్లి మండల కేంద్రంలో, 23న దుబ్బాక పట్టణంలో, 24న సిద్దిపేట వన్ టౌన్ పీఎస్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పట్టణంలో బస్టాండ్ చౌరస్తాతోపాటు ప్రధాన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ బగేల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment