ఫ్యాక్టరీ రద్దు చేసే వరకు పోరాటం
బెజ్జంకి(సిద్దిపేట) : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని గుగ్గిల్ల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అసౌకర్యంగా మారే ఫ్యాక్టరీ రద్దు కోరుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారు స్పందించకుంటే రద్దు చేసే వరకు ఐక్యంగా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, కార్యవర్గ సభ్యుడు వెంకట్‌రెడ్డి, రూపేశ్, భాస్కర్, మధు, జనార్దన్, నరేశ్, మహేశ్, శ్రవణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, బెజ్జంకిలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీపీఐని గ్రామ స్థాయిలో బలోపేతం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉండి పోరాడాలన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment