జాతీయ స్థాయి పోటీలకు మెదక్ క్రీడాకారులు
తూప్రాన్: జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికై నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కోడిప్యాక నారాయణగుప్త గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 నుంచి జమ్మూ కాశ్మీర్‌లోని ఎంఏ క్రీడా మైదానంలో 37వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ బాల, బాలికల చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. 24 వరకు పోటీలు జరుగనున్న నేపథ్యంలో ఈ పోటీలకు రాష్ట్ర బాల, బాలికల జట్టుకు జిల్లాకు చెందిన 8 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని వివరించారు. నవంబరు నెలలో రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బాలికల జట్టులో కార్తీక, శ్రీకృతి, శిరీష, గీతిక, బాలుర జట్టులో విజయ్, శ్రీవాత్సవ, వరుణ్, నిషాంత్ రాష్ట్ర జట్టులో స్థానం పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్ శర్మ, కోశాధికారి గోవర్దన్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు వెంకట్ రెడ్డి, కుమార్‌గౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment