ఇస్రో శాస్త్రవేత్తగాబెజ్జంకి యువకుడు
బెజ్జంకి(సిద్దిపేట): మండల కేంద్రానికి చెందిన ఒజ్జపల్లి శ్రీమాన్ ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒజ్జపల్లి నాగయ్య, సత్యలక్ష్మిల కుమారుడు. 2023లో ఇస్రోలో రాసిన పరీక్షలకు గాను బుధవారం వచ్చిన ఫలితాలలో ఆయన శాస్త్రవేత్తగా ఎంపికయ్యారని తండ్రి నాగయ్య తెలిపారు. బెంగళూరులోని ఐఐఎస్‌సీలో ఎంటెక్ చదివి గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికాలోని ప్రసిద్ధ సంస్థ కెడెల్స్‌లో డిజైన్ ఇంజనీర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. బెజ్జంకి యువకుడు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికకావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment