ప్రత్యేక వాహనం ఇదే..
సత్వరం విద్యుత్ సమస్యలపరిష్కారం
108 తరహాలో టోల్‌ఫ్రీ నంబర్ 1912..
తక్షణమే స్పందించేందుకు ప్రత్యేక వాహనం
మరమ్మతుల కోసం చెంతనే సామగ్రి
విద్యుత్ అంతరాయం ఏర్పడితే క్షణాల్లో ఆ ప్రాంతానికి చేరుకుని మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించనున్నారు. అందుకోసం టీజీఎస్‌పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నంబర్ 1912 ఏర్పాటు చేసింది. అంబులెన్స్ తరహాలో వాహనాన్ని జిల్లాకు కేటాయించారు. విద్యుత్ శాఖలో బ్రేక్‌డౌన్లు, ట్రాన్స్ ఫార్మర్ ఫెయిల్యూర్లను, గాలి వానలకు చెట్లు విరిగి వైర్లపై పడి అంతరాయం ఏర్పడితే త్వరగా స్ఫందించి సమస్యను పరిష్కరించనున్నారు.
సాక్షి, సిద్దిపేట: వానాకాలంలో, ఎండాకాలంలో సాధారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయే సమస్యలే ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు ఆయా అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే కార్యాలయాలకు వెళ్లి చెప్పాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు సుమారు గంటకుపైగానే పడుతుంది. ఇప్పుడు అలా కాదు.. విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే టోల్ ఫ్రీ 1912 నంబర్‌కు ఫోన్ చేసి సమస్య చెప్పవచ్చు.
ఆ సమస్యను స్థానిక విద్యుత్ అధికారులకు సమాచారం అందించనున్నారు. అనంతరం ఫిర్యాదుదారుడికి మెసేజ్ సైతం పంపిస్తుంది. వారు వెంటనే వెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని విద్యుత్ శాఖ మంజూరు చేసింది. ప్రత్యేక వాహనంలో కరెంట్ వైర్లు, థర్మోవిజన్ కెమెరాలు, ఫ్యూజులు, తాళ్లు, కండక్టర్లు, పవర్ రంపం మిషిన్, పొడవాటి నిచ్చెన వంటివి అందుబాటులో ఉండనున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే మార్చడానికి మరో ట్రాన్స్‌ఫార్మర్ తీసుకెళ్లడానికి వాహనం రెడీగా ఉంటుంది. వాహనంలో లైన్‌మెన్, ఇద్దరు జూనియర్ లైన్‌మెన్లు అత్యవసరంలో టీం స్పందించి సమస్యను పరిష్కరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment