హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ
సిద్దిపేటకమాన్: వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏసీపీ మధు తెలిపారు. జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారులు హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ నిర్వహిచారు. బస్టాండ్ చౌరస్తాలో హెల్మెట్ ధరించకుండానే వాహనాలను నడుపుతున్న వారికి పోలీసులు గులాబీలు ఇచ్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్,రోడ్డు నిబంధనలు పాటించాలి
సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ మధు
హెల్మెట్ ధరిస్తేనే రక్షణ
గజ్వేల్: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం గజ్వేల్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హెల్మెంట్ లేకుండా వెళ్తున్న వాహనదారులను ఆపి...పూలదండలు వేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ట్రాఫిక్ సీఐ మురళీ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment