మద్యం అమ్మినా.. తాగినా జరిమానా
● తిమ్మాపూర్ గ్రామస్తుల తీర్మానం
తిమ్మాపూర్‌లో తీర్మానం చేస్తున్న గ్రామస్తులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): మద్యం అమ్మినా, తాగినా జరిమానా విధిస్తామని మండలంలోని తిమ్మాపూర్ గ్రామస్తులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మడం వల్ల ఎంతో మంది మద్యానికి బనిసై తమ విలువైన జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించిన తర్వాత కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.5 లక్షలు, కొన్న వారికి రూ.10 వేల జరిమనా విధిస్తామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా దొంగచాటుగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. అనంతరం తీర్మాన పత్రాన్ని ఎస్‌ఐకి అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనేసంపూర్ణ ఆరోగ్యం
● జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి
దుబ్బాకటౌన్: పౌష్టికాహారంతోనే విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి అన్నారు. అలాగే విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించాలన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మూడు వందలకు పైగా వంటకాలను వారి తల్లిదండ్రుల సహాయంతో తయారు చేసి ప్రదర్శించడం అభినందనీయమన్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఎన్నారై దంపతులకు, ఇతర దాతలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి, నాగరాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తదితరులున్నారు.
నేడు జిల్లా స్థాయి
టాలెంట్ టెస్ట్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్‌ను శనివారం ఉదయం 9గంటలకు టీటీసీ భవన్‌లో నిర్వహించనున్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ విజ్ఞాన్ ప్రతిష్టాన్, జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్షుడు మామిడి పూర్ణచందర్ రావు, ప్రధాన కార్యదర్శి గుండా వేణుమాధవ్‌లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు జిల్లా స్థాయిలో పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో రాణిస్తే ఈ నెల 25న హైదరాబాద్‌లో జరుగనున్న రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్‌లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
హాస్టళ్ల సమస్యలుపరిష్కరించండి
ఏబీవీపీ ఆధ్వర్యంలో
కలెక్టరేట్ ఎదుట ధర్నా
సిద్దిపేటరూరల్: గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర కోకన్వీనర్ పవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లు జైళ్లకంటే అధ్వానంగా మారాయన్నారు. 12 నెలలుగా 50 మంది విద్యార్థులు వసతి గృహాల్లో చనిపోయారని, సుమారు 3వేల మంది విద్యార్థులు ఫుడ్‌పాయిజన్ బారిన పడ్డారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యుడు వివేక్, జిల్లా కన్వీనర్ ఆదిత్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment