వృద్ధులకు పెన్షన్ల పంపిణీ
వైద్య సిబ్బంది సమయ
పాలన పాటించాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్
సిద్దిపేటకమాన్: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ స్టోర్‌ను డీఎంహెచ్‌ఓ శుక్రవారం ప్రారంభించారు. చిన్న పిల్లలకు, గర్భిణులకు ఇచ్చే వ్యాధి నిరోధక టీకాల పంపిణీ వంద శాతం సక్రమంగా నిర్వహించాలన్నారు. సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. టీకాల కొరత లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల(సిద్దిపేట): వృద్ధుల పెన్షన్లపై అధికారులు స్పందించారు. వృద్ధులకు సకాలంలో పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నారంటూ శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన ఏడి‘పింఛన్’ అనే కథనానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. గుర్జకుంట గ్రామానికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment