వైభవంగా తిరువాభరణ శోభాయాత్ర
హుస్నాబాద్: పట్టణంలో అయ్యప్ప స్వాముల తిరువాభరణ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శోభాయాత్రలో పాల్గొన్నారు. స్వామి వారి బంగారు ఆభరణాలను స్థానిక కాశీ మరకత లింగేశ్వర స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు భక్తి శ్రద్ధలతో తీసుకెళ్లారు. అనంతరం అయ్యప్ప స్వామిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు.
పాల్గొన్న మంత్రి పొన్నం
Comments
Please login to add a commentAdd a comment