అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు జాతీయ పురస్కారం
సిద్దిపేటఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సామ సువర్ణాదేవికి గౌతమేశ్వర సాహితీ కళాసేవా సంస్థ జాతీయ స్థాయి ప్రతిభా పురస్కరాన్ని అందించింది. ఈ సందర్భంగా ఆదివారం సువర్ణాదేవి మాట్లాడుతూ సంస్థ ప్రతి ఏడాది సాహిత్య, సామాజిక సేవాల రంగాల్లో అందించే జాతీయ పురస్కారానికి ఈసారి ఎంపిక చేసి అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. యోగేంద్ర వేదపండితులు చేతుల మీదుగా స్వర్ణకంకణం, శాలువాతో సత్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు సువర్ణాదేవిని అభినందించారు.
‘బాలలార శతకం’ పుస్తకావిష్కరణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం రచించిన ‘బాలలార శతకం’ పుస్తకావిష్కరణ ఆదివారం నగరంలో జరిగిందని దాసరి రాజు యాదవ్ తెలిపారు. యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజేశం రచించిన బాలలార శతకం పుస్తకాన్ని పాలమూరు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారన్నారు. కార్యక్రమంలో చలసాని వెంకట్ యాదవ్, రవీందర్ యాదవ్, పోచబోయిన శ్రీహరి యాదవ్, మల్లికార్జున్ యాదవ్, చింతల మల్లేశం యాదవ్ అనీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారన్నారు.
రష్మితకు
బంగారు పతకం
సిద్దిపేటజోన్: పట్టణానికి చెందిన రష్మిత అర్చరీలో బంగారు పతకం సాధించింది. జూనియర్ ఇంటర్ డీస్ట్రిక్ట్ అర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలు సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగాయి. వివిధ జిల్లాలకు చెందిన అర్చరీ క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా జిల్లాలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాలోని 31 మంది అర్చరీ క్రీడాకారుల్లో రష్మిత ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించింది. సిద్దిపేటకు చెందిన రష్మిత ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో తొమ్మిదవ తరగతి చదువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment