కాళేశ్వరం జలాలు కేసీఆర్ చలువే
సిద్దిపేటరూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే కాళేశ్వరం ద్వారా ఈ ప్రాంతాలకు గోదావరి జలాలు వచ్చాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధి ఇర్కోడ్ గ్రామంలోని మల్లన్న దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో హరీశ్‌రావు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇర్కోడ్ మల్లన్న, కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు ఒకేరోజు జరగడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీహరిగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బౌద్ధంతోనే శాంతి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బౌద్ధమత ఆచారాలను పాటించడం ద్వారా శాంతి నెలకొంటుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. న్యాయవాది ఉప్పర మల్లేశం ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్న బుద్ద విహార్‌ను హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలో బుద్ధ విహార్ అవసరమని, నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బుద్దవిహార్ మైత్రి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు ఎనగందుల శంకర్, జిల్లా కార్యదర్శి ముత్యాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట గౌరవాన్ని నిలబెడదాం..
సిద్దిపేటజోన్: జిల్లాలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, సిద్దిపేట గౌరవాన్ని మరింత ఇనుమడింప చేసేందుకు అధికారులు తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి 9 వరకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయా అంశాల వారీగా సమీక్ష నిర్వహించారు. ముందుగా నియోజకవర్గ పరిధిలో పనుల స్థితిగతులు గూర్చి అడిగి తెలుసుకున్నారు. మంజూరు అయినప్పటికీ అంగన్వాడీ, సీసీ రోడ్లు, ఇతర పనులు ప్రారంభం కాక పోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే పనులను ప్రారంభించాలని సూచించారు. పదేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో ఉన్నామని, ఈసారి కూడా మొదటి స్థానంలో ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో పది ఫలితాలు గూర్చి సమీక్ష నిర్వహించారు.
పెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలి
మరింత మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన పెద్ద ఆస్పత్రిని మిగిలిన పనులను పూర్తి అందుబాటులోకి తేవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పనులు ఎక్కడికక్కడా ఆగి పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే మెడికల్ పీజీ కళాశాల పనులు పూర్తి చేయాలని, ఆయుష్ ఆసుపత్రి ప్రహరీ పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో టూ టౌన్, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ల భవనాలు మంజూరు అయ్యాయని, పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఇర్కోడ్ మల్లన్న దేవాలయంలో పూజలు
Comments
Please login to add a commentAdd a comment