మాల మహానాడు నేతపై పీఎస్‌లో ఫిర్యాదు
మిరుదొడ్డి(దుబ్బాక): మాల మహానాడు నాయకుడు పసుల రామ్మూర్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివారం భూంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మంద కృష్ణ మాదిగపై భౌతిక దాడులు చేస్తామంటూ మాట్లాడిన రామ్మూర్తిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొండల్, పర్శరాములు కృపాకర్, రాజశేఖర్, యాదగిరి, కరుణాకర్, సంజు, రాజు, మనోజ్, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment