కొమురవెల్లి మల్లికార్జునస్వామి హుండీల ద్వారా రూ.73.14 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు తెలిపారు. గురువారం ఆలయ ముఖ మండపంలో భక్తులు సమర్పించిన కానుకలను ఆలయసిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు లెక్కించారు. 33 రోజుల లో వచ్చిన ఈ ఆదాయాన్ని మెదక్ జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్ సమక్షంలో లెక్కించినట్లు రామాంజనేయులు తెలిపారు. నగదు రూ. 73,14,488, విదేశి కరెన్సీ నోట్లు 26, మిశ్రమ బంగారం 134 గ్రాములు, మిశ్రమ వెండి 9 కిలోల 300 గ్రాములు, పసుపు బియ్యం10 క్వింటాళ్లు వచ్చినట్లు తెలిపారు. – కొమురవెల్లి(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment