నల్ల బ్యాడ్జీలతోఉపాధ్యాయుల నిరసన
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన సమయంలో నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దాడిచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ వజ్రమ్మ, గీతాదేవి, వెంకటరమణ, రవీందర్‌రెడ్డి, దుర్గయ్య, శ్రీదేవి, రాజకుమార్ పాల్గొన్నారు.
వేంకటేశ్వర ఆలయ
హుండీ లెక్కింపు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వర ఆలయ హుండీ ఆదాయం రూ.15.25లక్షలు వచ్చాయి. సెప్టెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. రూ.15,25,194 నగదు రావడంతో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జమ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట డివిజన్ పరిశీలకులు విజయలక్ష్మి, ఆలయ చైర్మన్ రమేష్ విష్ణు, ఆలయ ఈఓ విశ్వనాథశర్మ, వికాశతరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భగీరథ నీరు వృథా
హుస్నాబాద్: పట్టణ శివారు కొత్త చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పంపు నుంచి సోమవారం నీరు లీకేజీ అయ్యింది. దీంతో నీరంతా వృథాగా పోయింది. దాదాపు రెండు గంటల పాటు నీరు లీకేజీ కావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది.
మూడు గంటలకే
బడికి తాళం
హుస్నాబాద్‌రూరల్: మండల పరిధి పందిల్ల ప్రభుత్వ ప్రాథమి పాఠశాలకు సోమవారం మూడు గంటలకే తాళం వేయడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. పందిల్ల పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు సెలవులో వెళ్తే, మరొకరు స్కూల్ కాంప్లెక్స్‌లో మీటింగ్ ఉందని స్కావెంజర్‌కు పాఠశాల తాళలు ఇచ్చి వెళ్లారు. స్కావెంజర్ 3 గంటలకు బడికి తాళం వేసి పిల్లలను ఇంటికి పంపించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంఈఓను వివరణ కోరగా స్కావెంజర్ పిల్లలను ఇంటికి పంపించిన విషయం పై చర్యలు తీసుకుంటామన్నారు.
బస్సులో ప్రయాణిస్తుండగా ఆగిన గుండె
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మృతి
నంగునూరు(సిద్దిపేట): బస్సులో ప్రయాణిస్తూ గుండె పోటుతో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మరణించిన ఘటన సోమ వారం రాత్రి బద్దిపడగలో చోటు చేసుకుంది. హుస్నాబాద్ మండలం చౌటపల్లికి చెందిన సుంచు లక్ష్మయ్య (70) ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు. సోమవారం కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకొని సిద్దిపేటలో హుస్నాబాద్ బస్సు ఎక్కాడు. బస్సు బద్దిపడగకు చేరుకోగానే గుండెపోటుతో అస్వస్థకు గురయ్యాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు 108 అబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని పరీక్షించగా వెంకటయ్య అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment