చెలుకలపల్లి వాసులకు న్యాయం చేస్తాం
చిన్నకోడూరు(సిద్దిపేట): అనంతగిరి రిజర్వాయర్‌తో పాటు అదనపు టీఎంసీ కాలువతో ఇబ్బంది పడుతున్న చెలుకలపల్లి వాసుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఆర్డీఓ సదానందం అన్నారు. శుక్రవారం గ్రామస్తులు పంప్‌హౌస్ వద్ద చేస్తున్న ధర్నాను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆర్డీఓకు వివరించారు. 12 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ స్పందించి గ్రామస్తులకు పునరావాసం విషయమై కలెక్టర్‌తో మాట్లాడుతామని, ఎవరూ ఆందోళనలు చేయవద్దని అన్నారు. ఆయన వెంట తహశీల్దార్ హరి కిరణ్, ఆర్‌ఐ మల్లికార్జున్ ఉన్నారు.
ఆర్డీఓ సదానందం
Comments
Please login to add a commentAdd a comment