బాధ్యతలు స్వీకరించిన అధికారులు
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల నూతన ఎంపీడీఓగా ఎం. జైపాల్‌రెడ్డి, తహసీల్దార్‌గా మల్లికార్జున్‌రెడ్డిలు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ, తహసీల్దార్‌లు మాట్లా డుతూ మండలంలోని అన్ని గ్రామాల అభి వృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా కృషి చేస్తామన్నారు. బాధ్యతలు చేపట్టిన అధికారులను మిరుదొడ్డి ఎంపీడీఓ గంగుల గణేశ్‌రెడ్డి, ఎంపీఓ జహూరుద్దీన్‌తో పాటు నాయకులు సన్మాంచిన స్వాగతం పలికారు.
మా గ్రామాలను
విలీనం చేయండి
మద్దూరు(హుస్నాబాద్): అర్జున్‌పట్ల, కమలాయపల్లి గ్రామాలను పూర్తి స్థాయిలో చేర్యాల మండలంలో విలీనం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాలను 2020 డిసెంబర్ 17న చేర్యాల మండలంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా నేటికీ విలీనం చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదన్నారు. విలీనం చేయకపోతే ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment