పెండింగ్ బిల్లులు విడుదల చేయండి
సిద్దిపేటరూరల్: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులు కోరారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ మనుచౌదరికి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతున్న క్రమంలో పలు రకాల పనుల కోసం వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నామన్నారు. దీంతో నిధుల కొరత తీవ్రంగా ఉండడంతో పనులు చేయడం కష్టతరంగా మారిందన్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సొంత డబ్బులతో మోటార్లు, బోర్ మరమ్మతులు చేపట్టామన్నారు. ఆ డబ్బులు నేటికి రాలేవన్నారు. ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. కార్యక్రమంలో టీపీఎస్‌ఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాగరాజు, జిల్లా అధ్యక్షుడు గౌతమ్, ట్రెజరర్ రాజుగౌడ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు పంచాయతీ కార్యదర్శుల వినతి
Comments
Please login to add a commentAdd a comment