కోడ్ పకడ్బందీగా అమలు
ిసద్దిపేటకమాన్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోడ్ నిబంధనల అమల్లో అశ్రద్ధ తగదని అధికారులకు సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. దొంగతనాల నివారణ గురించి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు నిర్వహించాలని సూచించారు. డయల్ 100కు కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ సుభాష్‌చంద్రబోస్, ఏసీపీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు అవార్డులు, రివార్డులు
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి అవార్డులు, రివార్డులు అందజేస్తామని సీపీ అనురాధ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలు పొందిన పోలీసు అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల కోసం అంకిత భావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలందించాలని అన్నారు. ఉత్కృష్ట సేవా పతకం పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు శ్రీరామ్, మల్లికార్జున్, మహిళ హోంగార్డు నసీమా ఉన్నారు. అతి ఉత్కృష్ట సేవా పతకం పొందిన వారిలో సిద్దిపేట ట్రాఫిక్ ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి, గజ్వేల్ ట్రాఫిక్ పీఎస్ ఏఎస్‌ఐ వెంకటరమణరెడ్డి, చేర్యాల హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు నారాయణ, యాదయ్య, ప్రభు, హోంగార్డు జీవన్‌రెడ్డి, ఏఆర్‌ఎస్‌ఐ అలెగ్జాండర్ నిత్యానందం ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
సీపీ అనురాధ
పోలీసు అధికారులతో సమావేశం
సత్ప్రవర్తనతో మెలగండి
రౌడీలు, కేడీలు సత్ప్రవర్తనతో మెలగాలని సీపీ అనురాధ సూచించారు. పోలీసు కమిషనరేట్‌లో జిల్లాలో ఉన్న కేడీ, రౌడీ, అనుమానితులకు శుక్రవారం సీపీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సత్ప్రవర్తనతో ఉన్న వారికి పోలీసుల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. వారి ప్రవర్తనను బట్టి వారిపై ఉన్న కేసులను తొలగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment