తూప్రాన్: అక్రమంగా తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధిత రైతులు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దాతర్‌పల్లి గ్రామ సమీపంలో 24 ఎకరాల భూమిని కొన్నేళ్ల కిందట కొందరు రైతులు కొనుగోలు చేసుకొని పంటలు పండిస్తున్నారు. ఆ భూములపై బ్యాంకు రుణాలు సైతం పొందారు. కానీ కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిస్తూ బాధిత రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో తహసీల్దార్ విజయలక్ష్మిని వివరణ కోరగా కోర్టు నుంచి పత్రాలు సమర్పించడంతో తాము రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. తమ భూములు తమకే తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నారు.
లబోదిబోమంటున్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment