దుబ్బాక: దుబ్బాక మున్సిపల్ చివరి కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్‌పర్సన్ గన్నె వనిత అధ్యక్షతన తీవ్ర భావోద్వేగాల మధ్య జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ కొలువు దీరి జనవరి 26తో ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై పాలకవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వనిత, వైస్‌చైర్‌పర్సన్ సుగుణ తో పాటు కౌన్సిలర్లు తమ ఐదేళ్ల కాలంలో చేసిన పనులను ప్రజలతో మమేకమైన అనుబంధాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పదవులు శాశ్వతం కావని చేసిన సేవలు ప్రజల గుండెల్లో పదిలంగా నిలచిపోతాయన్నారు. రాష్ట్రంలోనే దుబ్బాక మున్సిపాల్టీ ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. చైర్‌పర్సన్ వనిత మాట్లాడుతూ, తనకు అన్ని విధాలుగా అండగా ఉంటూ అభివృద్ధికి సహకరించిన కౌన్సిలర్లందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆప్యాయత, తన తోటి కౌన్సిలర్ల సహకారాన్ని మరువలేమని బావోద్వేగానికి గురయ్యారు.
కంటతడి పెట్టిన ప్రజాప్రతినిధులు
Comments
Please login to add a commentAdd a comment