దుబ్బాకరూరల్: ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో మృతదేహమై తేలిన ఘటన అక్బర్‌పేటభూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హరీశ్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేర్ల రంజీత్(33) ఇంట్లో 21న సాయంత్రం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అదే రోజు భూంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం గ్రామ శివారులోని పోతారెడ్డిపేట పెద్ద చెరువు వద్ద బైక్ కనిపించింది. చెరువు వద్ద చెప్పులు,సెల్ ఫోన్ ఆధారంగా చెరువులో గాలించగా రంజీత్ మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిన్ననిజాంపేట గ్రామంలో వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment