ఇంకా రుణమాఫీ కాలేదు
సిద్దిపేటజోన్: బ్యాంకులో తెచ్చిన అప్పుకు వడ్డీ కడితే రుణంమాఫీ అవుతుందని భావించి ఎక్కడ దొరికితే అక్కడ మిత్తికి డబ్బులు తెచ్చి కట్టినా ఇంకా రుణమాఫీ కాలేదని పలువురు రైతులు తెలి పారు. ఆ మేరకు ఎమ్మెల్యే హరీశ్ రావుకు నివేదించారు. బుధవారం గాడిచర్ల పల్లి(15వార్డు)లో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల, రేషన్ కార్డుల లబ్ధిదారుల వివరాలు కమిషనర్ చదివి వినిపించారు. సుధాకర్ అనే రైతు పైకిలేచి తన పేరిట బ్యాంకులో అప్పు ఉందని, రూ 25 వేలు కడితే అప్పు మాఫీ అవుతుందని చెబితే మిత్తికి తెచ్చి డబ్బులు కట్టానన్నారు. ఇప్పటికీ రూ 1.90లక్షల రుణం అలాగే ఉందన్నారు. మరో రైతు మోహన్‌రావు కూడా నిలబడి తనది ఇదే పరిస్థితి అన్నారు. కొందరికి రూ.40 వేలు అప్పు కూడా రుణమాఫీ కాలేదని, రాష్ట్రం మొత్తం పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ జరిగిందని, పండుగలు చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఒక్క గాడిచర్ల పల్లి 43 మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఇదే పరిస్థితి రాష్ట్రంలో అంతటా ఉందన్నారు. రుణమాఫీ మీద ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు చేసుకున్నాం మళ్లీ ఎందుకని జహంగీర్ అధికారులను సభలో ప్రశ్నించారు.
భాగ్యమ్మకు ఆత్మీయ భరోసా ఎందుకివ్వరు?
వార్డుకు చెందిన భాగ్యమ్మ అనే మహిళ తాను వ్యవసాయ కూలీనని ప్రభుత్వ సాయం అందకుండా పోయిందని న్యాయం చేయాలని ఎమ్మెల్యే హరీశ్ రావుకు వినతిపత్రం అందజేసింది. స్పందించిన ఆయన ఆమెకు భూమి లేదు, నాట్లు వేయడానికి వ్యవసాయ కూలీగా పోతోందన్నారు. గాడిచర్లపల్లి మున్సిపల్ పరిధిలో ఉందని, ఉపాధి కూలీ పేరిట ఆత్మీయ భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సాకుల పేరుతో కోతలు పెట్టడం సరికాదని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంజుల, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ సులోచన, మాజీ కౌన్సిలర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సీతారాముల కల్యాణం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సీతారాములు కళ్యాణం అంత్యంత వైభవంగా జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో కల్యాణం వైభవంగా నిర్వహించారు. వేడుక చూసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అప్పులు తెచ్చి మిత్తి కట్టాం
ఎమ్మెల్యే ఎదుట ప్రజల ఆవేదన
ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment