దుబ్బాక మీదుగా సిరిసిల్ల హైవే
దుబ్బాక: చేగుంట నుంచి దుబ్బాక మీదుగా రాజన్నసిరిసిల్ల వరకు కొత్తగా జాతీయ రహదారి నిర్మాణం కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం దుబ్బాక డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పై విషయమై కలిసి వినతిపత్రం అందించారు. చేగుంట–సిరిసిల్ల జాతీయ రహదారి నిర్మాణం చేపడితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు చాలా దూరం తగ్గుతుందన్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జాతీయ రహదారి మంజూరుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డెవలఫ్‌మెంట్ ఫోరం అధ్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్, పాలరాజు, చంద్రశేఖర్, వెంకటేశ్, బీజేపీ నాయకులు ఉపేందర్, బాలరాజు తదితరులు ఉన్నారు.
ఆ దిశగా కృషి చేస్తా
ఎంపీ రఘునందన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment