పుణే: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు నుంచి మైదానంలో ప్రేక్షకులను అనుమతిస్తుండగా... ఇప్పుడు వన్డేలకు మాత్రం అది సాధ్యం కాదని తేలిపోయింది. ఇరు జట్ల మధ్య పుణేలో జరిగే 3 వన్డే మ్యాచ్‌లను అభిమానులు లేకుండానే ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇది తప్పలేదని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘వన్డే సిరీస్ నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మహారాష్ట్రలో కోవిడ్–19 విజృంభిస్తున్న దశలో ప్రేక్షకులను మైదానంలోకి నుమతించడం శ్రేయస్కరం కాదని అర్థమైంది. అందుకే ఆటగాళ్లు, ఇతర సిబ్బందిని మాత్రమే అనుమతిస్తూ మ్యాచ్‌లు జరుపుతాం. వారి కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం’ అని అసోసియేషన్ స్పష్టం చేసింది. మార్చి 23, 26, 28 తేదీల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment