Photo Courtesy: DC Twitter
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్-2021 టోర్నీకి విరామం ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ప్రాణాంతక కోవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పరిస్థితులు చక్కడిన తర్వాతే మళ్లీ మైదానంలోకి దిగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు అశ్విన్ ట్వీట్ చేశాడు.
ఇక అశ్విన్ నిర్ణయంపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం స్పందించింది. కష్ట సమయంలో అతడికి పూర్తి అండగా నిలబడతామని సంఘీభావం ప్రకటించింది. అశ్విన్ కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రార్థిస్తోందని, త్వరలోనే అందరూ కోలుకుంటారని ఆకాంక్షించింది. అదే విధంగా.. అశ్విన్ జట్టుతో చేరాలని భావించినపుడు తప్పకుండా అతడు తిరిగిరావొచ్చని పేర్కొంది. కాగా, ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరుజట్ల స్కోర్లు ‘టై’ కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా వార్నర్ సేన 7 పరుగులు చేయగా...ఢిల్లీ 8 పరుగులు చేసి గెలుపొందింది.
స్కోర్లు: ఢిల్లీ క్యాపిటల్స్- 159/4 (20)
సన్‌రైజర్స్ హైదరాబాద్- 159/7 (20)
చదవండి: SRH vs DC: ‘సూపర్’లో రైజర్స్ విఫలం
I would be taking a break from this years IPL from tomorrow. My family and extended family are putting up a fight against #COVID19 and I want to support them during these tough times. I expect to return to play if things go in the right direction. Thank you @DelhiCapitals 🙏🙏
— Stay home stay safe! Take your vaccine🇮🇳 (@ashwinravi99) April 25, 2021
Comments
Please login to add a commentAdd a comment