టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో గాయపడి జట్టుకు దూరమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కోలుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు తిరిగి జట్టుతో కలవనున్నట్లు సమాచారం. హిట్‌మ్యాన్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. రోహిత్ ఫిట్‌నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
"రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతడు సరైన సమయానికి కోలుకున్నాడు. అతడికి వేసిన కుట్లను వైద్యులు తొలిగించారు. రోహిత్‌కి మా ఫిజియోలు రెండు టెస్టులో పాల్గోనేందుకు అనుమతి ఇచ్చారు. ఒకటి రెండు రోజుల్లో అతడు బంగ్లాదేశ్‌కు పయనం కానున్నాడు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
కాగా బంగ్లాతో రెండో వన్డేలో రోహిత్ గాయంతో బాధపడుతున్నప్పటికీ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేసి బంగ్లా జట్టుకు చెమటలు పట్టించాడు. ఇక ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 254 పరగుల భారీ ఆధిక్యం పొందిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతుంది. కాగా డిసెంబర్ 22 నుంచి ఢాకాలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది..
చదవండి: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment