రాంచీ: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 246 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లకు 327 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు కెప్టెన్ స్నేహ దీప్తి (134 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్స్‌లతో 173) అద్భుత సెంచరీ చేసింది.
ఎన్.అనూష (68 నాటౌట్; 4 ఫోర్లు), దుర్గ (56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. సిక్కిం జట్టు 41.4 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. శరణ్య (2/22), చంద్రలేఖ (2/10), బి.అనూష (2/13) రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment