![పింఛన్ నగదును అందజేస్తున్న ద్వారకానాథ్ - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/10/09nlr700-604992_mr_0.jpg.webp?itok=3NQxwjWc)
పింఛన్ నగదును అందజేస్తున్న ద్వారకానాథ్
● నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్
నెల్లూరు(బృందావనం) : దివ్యాంగులు, వృద్ధులు, నిరుపేదలకు ప్రతినెలా జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం ద్వారా పింఛన్ అందించడం అభినందనీయమని నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. నగరంలోని శ్రీపాండురంగ అన్నదాన సమాజం వసతి గృహంలో 13వ విడతగా 105 మందికి రూ.500 చొప్పున పింఛన్ నగదును ఆయన ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంఛన్ల పంపిణీ కార్యక్రమం ఆదర్శనీయమంటూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పేర్ల సీతారామారావు, గౌరవాధ్యక్షుడు కోట సూర్యనారాయణ, కోశాధికారి బైసాని జ్యోతిప్రసాద్, పింఛన్ కమిటీ చైర్మన్ నిరంజన్, సభ్యులు పాదర్తి బాలాజీ, గురునాథం, కార్పొరేటర్ మొగళ్లపల్లి కామాక్షీదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment