![ఇంటర్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10atk05-240066_mr-1739212612-0.jpg.webp?itok=o8v1ARK0)
ఇంటర్ మార్కుల మెమో అందజేత
ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని బీఎస్సార్ కళాశాలలో చదివిన కాటేపల్లి సురేంద్ర అనే విద్యార్థికి ఎట్టకేలకు ఇంటర్ మార్కుల ఒరిజినల్ మెమోను కళాశాల యాజమాన్యం సోమవారం సాయంత్రం అందజేసింది. కళాశాలకు రూ.20 వేలు ఫీజు బాకీ ఉన్నాడని, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా ఇవ్వని విషయం తెలిసిందే. ఈ విషయమై గత మంగళవారం ‘సర్టిఫికెట్లు ఇవ్వకుండా’ అనే శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించిన ఆర్డీఓ కళాశాల యాజమాన్యానికి ఫోన్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు బకాయిలు ఉన్నా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం నేరమని, వెంటనే ఆ విద్యార్థికి సర్టిఫికెట్ అందజేయాలని లేకపోతే కేసు నమోదు చేయడంతోపాటు కళాశాల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో సోమ వారం సాయంత్రం కళాశాల ఉద్యోగి ఖాజా ఇంటర్మీడియట్ ఒరిజినల్ మార్కుల మెమోను ఆర్డీఓ ద్వారా విద్యార్థికి అందజేశారు. ఆర్డీఓ పావని బాధిత విద్యార్థిని కార్యాలయానికి పిలిపించి సర్టిఫికెట్ అందజేశారు.
![ఇంటర్ మార్కుల మెమో అందజేత 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/11022025-nrt_tab-07_subgroupimage_1879271216_mr-1739212612-1.jpg)
ఇంటర్ మార్కుల మెమో అందజేత
Comments
Please login to add a commentAdd a comment