![స్వచ్ఛాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10nlr136-240081_mr-1739212611-0.jpg.webp?itok=yS8avw6h)
స్వచ్ఛాంధ్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
నెల్లూరు రూరల్: ప్రతి నెలా 3వ శనివారం అన్ని శాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరం నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావడం, గ్రామ పంచాయతీల్లో సామాజిక మరుగుదొడ్ల భవన నిర్మాణాలను పూర్తి చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం, బ్లూ, రెడ్, గ్రీన్ డస్ట్‌బిన్లను ప్రజలకు అందించడం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జిల్లాలోని చాలా మండలాలు ఉపాధి హామీ పనుల కల్పనలో బాగా వెనుకబడి ఉన్నాయని, ఇకపై 70 నుంచి 80 శాతం తగ్గకుండా పనులు కల్పించేందుకు ఎంపీడీఓలు, ఏపీఓలు లక్ష్యం నిర్దేశించుకుని పని చేయా లన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయాల పరిధి లో ఎంఎస్‌ఎంఈ సర్వే హౌస్‌హోల్డ్ సర్వేలో వేగం పెంచాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు విజయ న్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే
చర్యలు తప్పవు
కలెక్టర్ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment