ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత
కలిగిరి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో శ్రీరూప తరగతి గదిలో ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి సొమ్మసిల్లి పడిపోయే స్థితికి చేరుకుంది. అదే సమయంలో మహిత అనే విద్యార్థిని గుండెనొప్పిగా ఉందని చెప్పింది. ఉపాధ్యాయులు ఆ ఇద్దరిని వెంటనే కలిగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. వైద్యాధికారి సద్దాం, వైద్యసిబ్బంది విద్యార్థినులకు చికిత్స అందజేశారు. శ్రీరూప జలుబు, దగ్గు కారణంగా శ్వాస తీసుకోలేక పోయిందని, మహితకు గ్యాస్ట్రిక్ కారణంగా గుండెలో నొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం కొద్దిసేపటికి సాధారణ స్థితికి చేరుకున్నారు. పీహెచ్‌సీకి చేరుకున్న కుటుంబ సభ్యులు విద్యార్థినులను ఇళ్లకు తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment