మద్యం దుకాణాలకు లక్కీడిప్
నెల్లూరు (క్రైమ్): గీత కార్మిక సామాజిక వర్గానికి జిల్లాలో కేటాయించిన 18 మద్యం దుకాణాలకు లక్కీడిప్ ప్రక్రియ ముగిసింది. 18 దుకాణాలకు 151 మంది 215 దరఖాస్తులు దాఖలు చేశారు. అధికారుల పరిశీలన అనంతరం సోమవారం నగంరలోని జెడ్పీ సమావేశ మందిరంలో జేసీ కార్తీక్ లక్కీడిప్ ప్రక్రియతో మద్యం దుకాణాలను కేటాయించారు. నెల్లూరు కార్పొరేషన్‌లో ఒక దుకాణానికి అత్యధికంగా 30 దరఖాస్తులు దాఖలు కాగా కావలి, ఆత్మకూరు మండలాల నుంచి అత్యల్ప సంఖ్యలో మూడు చొప్పున దరఖా స్తులు దాఖలయ్యాయి. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు లైసెన్సు ఫీజును చెల్లించి ప్రొవిజినల్ లైసెన్సులను పొందారు. నెల్లూరు దుకాణాన్ని వి.వరమణి, ఆత్మకూరు మున్సిపాల్టీలోని దుకాణాన్ని కె. వసుంధర, ఆత్మకూరు మండలంలోని దుకాణాన్ని బి. అనూష దక్కించుకున్నారు. దరఖాస్తుల రూపేణా రూ.4.30 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది. లక్కీడిప్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, జిల్లా అధికారి ఎ. శ్రీని వాసులనాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment