![ఉత్సవమూర్తులకు పూజలు చేస్తున్న అర్చకులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/10/09vgr141-410007_21_26_mr_0.jpg.webp?itok=XtiG8tSq)
ఉత్సవమూర్తులకు పూజలు చేస్తున్న అర్చకులు
సైదాపురం: శ్రీరామనవమిని ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సైదాపురంలో శ్రీరాముని పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు.
సమష్టి కృషితోనే
సమస్యల పరిష్కారం
వెంకటగిరి: గాండ్ల, తెలికుల కులస్తులు సమష్టిగా కృషి చేస్తేనే సమస్యలు పరిష్కరించుకోగలమని రాష్ట్ర గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి హరగోపాల్ అన్నారు. స్థానిక పింజల వీరయ్య కల్యాణ మండపంలో ఆదివారం ఆ సంఘం వెంకటగిరి శాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వర్గానికి చెందిన ప్రముఖుల దంపతులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు దివంగత గ్రోసు గోపాలయ్య సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి శ్రీనివాసులు, సూర్యప్రకాష్, బీకేప్రసాద్, చిరువెళ్ల ప్రభాకర్, బద్రి నవీన్ పాల్గొన్నారు.
వైభవంగా
రాపూరమ్మ జాతర
రాపూరు: గ్రామదేవత రాపూరమ్మ జాతర మూడో రోజు ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఆలయంలో పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ
రాపూరమ్మను ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు శశిరెడ్డి, మస్తాన్, కోటిరెడ్డి, పిచ్చిరెడ్డి, లోకేష్, వెంకటసుబ్బయ్య తదితరులు ఉన్నారు.
వైభవంగా గ్రామోత్సవం
రాపూరమ్మ గ్రామోత్సవం ఆదివారం రాత్రి వేడుకగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ట్రాక్టర్‌పై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రాపూరు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
![రాపూరమ్మను దర్శించుకున్న
ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ 1](https://www.sakshi.com/gallery_images/2023/04/10/09vgr124-410004_21_48_mr.jpg)
రాపూరమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
Comments
Please login to add a commentAdd a comment