![పట్టా అందజేస్తున్న రామ్‌కుమార్‌రెడ్డి - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/20/19vgr145-410007_21_1_mr_0.jpg.webp?itok=MKR5B4bD)
పట్టా అందజేస్తున్న రామ్‌కుమార్‌రెడ్డి
● అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలు
పంపిణీ చేసిన నేదురుమల్లి
సైదాపురం: అసైన్డ్ భూముల్లో సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేద రైతులకు ఆ భూమిపై సర్వహక్కులూ కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం నేడు శాశ్వత పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిందని వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన సైదాపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సైదాపురం మండలంలో 404 మంది రైతులకు 533 ఎకరాల అసైన్డ్ భూములపై సర్వహక్కులు కల్పిస్తున్నట్టు తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రైతు ముగింటకే రాయితీలు వచ్చాయని, విత్తు నుంచి విక్రయం వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని గుర్తుచేశారు. సైదాపురం మండలంలో మూడు వేల ఎకరాల్లో సాగు చేసుకుంటున్న రైతులకు సంక్రాంతి కానుకగా పట్టాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రవికుమార్, సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గోగినేని శివకుమార్, జేసీఎస్ కన్వీనర్ గుంటమడుగు శ్రీనివాసులురాజు, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ తిరకాల భాస్కర్, నేతలు రాఘవరెడ్డి, మాలకొండారెడ్డి, రామ్‌గోపాల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్‌రెడ్డి, మనోహర్, ప్రసాద్‌రాజు, విజయభాస్కర్, వీరాస్వామి, హరి, సైదాపురం సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment