No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Wed, May 8 2024 2:45 AM

No He

జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో దురాయి అనే ఆచారం ఎంతో కాలంగా ఉంది. గ్రామంలో ఏదైనా సమస్య వస్తే అక్కడి కాపులు సమావేశమై తీర్పునివ్వడం దీని ప్రధాన లక్ష్యం. ఈ శాసనాన్ని ఎవరూ అతిక్రమించకుండా తప్పక గౌరవించాలి. ఈ క్రమంలో ఈ ఆచారాన్ని టీడీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో నోట్ల కట్టలను వెదజ ల్లుతూ.. తమ పార్టీ అభ్యర్థికే ఓటేసేలా అక్క డి పెద్దల ద్వారా శాసనం జారీ చేయిస్తోంది. ఓటమి భయంతో వేమిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో గెలుపొందడమే ధ్యేయంగా టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారు. ప్యాకేజీలను ప్రకటించి పలు పార్టీల నేతలను తమ వైపు తిప్పుకోవడం.. వందల కోట్లను నీళ్లలా పారిస్తూ ఓట్లను కొల్లగొట్టాలని వీరు యత్నించినా, ఆశించిన స్థాయిలో ఫలితం కానరావడంలేదు. ఈ తరుణంలో వీరి చూపు మత్స్యకార గ్రామాలపై పడింది. గ్రామాల్లో అనాదిగా వస్తున్న దురాయి ఆచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

నిన్న ఇందుకూరుపేట..

ఇప్పుడు విడవలూరు

దురాయి పేరిట ఇందుకూరుపేట మండలంలోని కృష్ణాపురంలో ఓట్లను వేమిరెడ్డి దంపతులు కొనుగోలు చేసిన విషయం విదితమే. తాజాగా విడవలూరు మండలంలోని రెండు మత్స్యకార గ్రామాలపై వీరు చూపు పడింది. స్థానికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బుతో ఓట్లను కొల్లగొడుతున్నారు.

తీర ప్రాంతంపైనే దృష్టంతా..

కోవూరు నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాలు చాలా ఉన్నాయి. మత్స్యకార నేతలతో రహస్య మంతనాలు సాగిస్తూ దురాయి ద్వారా ఓట్లు వేయించాలని అభ్యర్థిస్తున్నారు.

● ఇందుకూరుపేట మండలంలోని కృష్ణాపురం పంచాయతీలో 781 ఓట్లకు రూ.80 లక్షలతో బేరాన్ని వేమిరెడ్డి దంపతులు కుదుర్చుకున్నారని సమాచారం. ఇలా ఓటుకు రూ.10,200 మేర వెచ్చించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

● విడవలూరు మండలంలోని కొత్తూరులో 700 ఓట్లకు రూ.75 లక్షలు.. లక్ష్మీపురంలో 1100 ఓట్లకు రూ.90 లక్షలు.. ఇలా రూ.1.65 కోట్లను వెచ్చించారనే టాక్‌ స్థానికంగా నడుస్తోంది. దురాయి ఆచారాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లను నిస్సిగ్గుగా కొనుగోలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అధికారులెక్కడా..?

ప్రజాస్వామ్య వ్యవస్థకు పాతరేసేలా టీడీపీ సాగిస్తున్న కుతంత్రాలపై అధికార యంత్రాంగం స్పందించకపోవడం గమనార్హం. దురాయి ద్వారా ఇందుకూరుపేట మండలంలో ఓట్ల కొనుగోలు వ్యవహారం బయటకొచ్చినప్పుడూ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. తాజాగా విడవలూరు మండలంలో వెలుగులోకి వచ్చినా అధికారులు తమ పాత పంథానే కొనసాగిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

ప్రతి చోటా ఇంతే..

కోవూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో నోట్ల కట్టలకే పని కల్పించారు. వర్గ విభేదాలతో పార్టీ కేడర్‌ వారికి ముఖం చాటేయడంతో గెలుపు కోసం అడ్డదారులు వెతుక్కుంటున్నారు. గ్రామాల వారీగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు రూ.15 లక్షలు.. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు రూ.25 లక్షల చొప్పున ప్యాకేజీలను నిర్దేశించి కొనుగోలు చేస్తున్నారు. ఓటర్లకు సైతం భారీగానే డబ్బులిస్తామని, వీటి పంపిణీ బాధ్యత మీదేనని చెప్తుండటం గమనార్హం.

విడవలూరు మండలంలో

భారీగా తాయిలాలు

మత్స్యకార గ్రామాల్లో

అనాదిగా ఆచారం

మరోసారి తెరపైకి తెచ్చిన టీడీపీ

లక్ష్యాన్ని మార్చేసి.. ఓట్లను నోట్లతో

కొనుగోలు చేస్తున్న వైనం

విడవలూరు మండలంలో

రూ.1.65 కోట్లతో ఎర

గతంలో ఇందుకూరుపేటలోనూ

ఇదే తంతు

ఓటమి భయంతో డబ్బులను

కుమ్మరిస్తున్న వేమిరెడ్డి

No Headline
1/1

No Headline

Advertisement
Advertisement