కాకాణి హౌస్ అరెస్ట్
కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటన విషయం తెలుసుకున్న టీడీపీ కీలక నేతలు ఆయన పర్యటనను పోలీసులతో బలప్రయోగం చేయించి ఆయన్న గృహా నిర్బంధంలో ఉంచారు. మంగళవారం ఉదయం నుంచి కాకాణి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఆయన్ను బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కాకాణి హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు భారీగా తరలిరావడంతో ఆయన నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము సామరస్యంగా వెళ్లి కాలువ పనులు పరిశీలన చేస్తే తప్పేమిటని పోలీసులను కాకాణి ప్రశ్నించారు. వారు మాత్రం కాకాణి వెళ్లేందుకు ససేమిరా అని గృహా నిర్బంధంలో ఉంచారు. నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కాకాణి నివాసానికి చేరుకుని ఆయనకు అండగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment