సహకార రంగం ద్వారానే జిల్లా సమగ్రాభివృద్ధి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలో సహకార సంఘాలను పటిష్ట పరిచి, సభ్యు లకు మంచి సేవలందించడం ద్వారా ఆర్థిక సామాజిక సాధికారత దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల్లోని రికార్డుల కంప్యూటరీకరణ చివరి దశకు వచ్చిందని, పీఏసీఎస్‌ల కంప్యూటీకరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఆన్‌లైన్ సేవలకు, కోర్ బ్యాంకింగ్ సేవల కు అనుసంధానం జరిగి సభ్యులకు రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, ఇతర శాఖలతో పథకాలు పొందడానికి వీలవుతుందన్నారు. ప్రత్యేకించి సంఘంలో రికార్డుల పారదర్శకత, జవాబు దారీతనం, ఆర్థిక మోసాలు అరికట్టేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో నెల్లూరు, ప్రకాశం డీసీసీబీలను అనుసంధానించడం జరిగిందన్నారు. ప్రపంచ వికేంద్రీకత ఆహార భద్రతా పథకం కింద పడుగుపాడు పీఏసీఎస్ పరిధిలో అతి పెద్ద ధాన్యం నిల్వ కేంద్రం మంజూరైందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి గుర్రప్ప, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ అధికారి రమేష్‌నాయక్, నాబార్డు ఏజీఎం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment