టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం

Published Wed, Nov 6 2024 12:41 AM | Last Updated on Wed, Nov 6 2024 12:41 AM

టీడీప

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం

సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి కనుసన్నల్లో షాడో ఎమ్మెల్యే నేతృత్వంలో అవినీతి, అక్రమాలు, దందాలు మితిమీరాయి. ఇసుక, మట్టి, గ్రావెల్‌ దోపిడీ, మద్యం వ్యాపారంతో ప్రారంభమైన అరాచకాలు తాజాగా రైతులకు సాగునీటి పారుదల పేరుతో రూ.పాతిక కోట్లు దోచుకునేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. మాయా టెండర్ల మాటున కాలువల్లో తూతూ మంత్రంగా పూడిక తీసి నిధులు దారి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యే ఇసుక దోపిడీ దాష్టీకానికి ఓ గిరిజనుడి కుటుంబం బలైపోయింది. అవినీతి పనులను పరిశీలించి, ఆ గిరిజనుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసుల సహకారంతో హౌస్‌ అరెస్ట్‌ చేయించి ఉక్కుపాదం మోపారు. టీడీపీ మూకలతో కాలువ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించారు.

టెండర్లు ఖరారు కాకుండానే

కనుపూరు కాలువ పనులు

సూరాయపాళెం ఇసుక రీచ్‌లో తమ్ముళ్ల ధనదాహానికి గిరిజనుడి బలి

ఆ కుటుంబాన్ని పరామర్శించి, అక్రమ పనుల పరిశీలనకు కాకాణి సిద్ధం

వెళ్లనివ్వకుండా కాలువ వద్ద

మోహరించిన టీడీపీ మూకలు

ఫ్లెక్సీలు చించి, టెంట్లు కూల్చి, కుర్చీలు కాలువలో పడేసి వీరంగం

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి యత్నం

ఉద్రిక్త పరిస్థితుల్లో పోలీసుల

ముందస్తు చర్యలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు అవినీతి, అక్రమాల్లో మునిగి తేలిపోతున్నారు. టీడీపీ దోపిడీలు, దాష్టీకాలను మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరచూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆయన తనయుడు సహజ వనరుల నుంచి ప్రజా సంపద వరకు చేస్తున్న దోపిడీపై కాకాణి నిలదీస్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకయ్యారు. దీన్ని జీర్ణించుకోకలేక టీడీపీ నేతలతో ఇప్పటికే కాకాణిపై కేసులు నమోదు చేయించారు. తాజాగా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు వ్యవసాయ రంగానికి జీవనాడి లాంటి సాగునీటి కాలువలకు తాత్కాలిక మరమ్మతులు, పూడిక తీత పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయా పనులకు పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించినా.. ఏకపక్షంగా ఆ పనులు తామే చేపట్టే విధంగా టెండర్లు ఖరారు కాకుండానే తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాసి కాలువల్లో ఽకాసులు దోపిడీ చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన అఽధికార యంత్రాంగం మిన్నకుండిపోయింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సాగునీటిని అందించే సంగం ఆనకట్ట వద్ద నుంచి కనుపూరు కాలువ పూడికతీత పనుల్లో వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సిద్ధమయ్యారు. అయితే కాకాణి అక్కడికి వెళ్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావించిన టీడీపీ నేతలు పొదలకూరు మండలంలోని కనుపూరు కాలువ వద్ద పనుల పరిశీలన కార్యక్రమాన్ని పోలీస్‌ బలప్రయోగంతో కాకాణిని హౌస్‌ అరెస్ట్‌ చేసి అడ్డుకోవడం జిల్లాలో సంచలనంగా మారింది.

రూ.25 కోట్ల దోపిడీకి ప్రణాళిక

సర్వేపల్లి నియోజకవర్గంలో ఓఅండ్‌ ఎం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) ద్వారా సాగునీటి కాలువలకు తాత్కాలిక మరమ్మతులు, పూడికతీత పేరుతో దాదాపు రూ.25 కోట్లకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా అత్యవసర పనుల పేరుతో 23 కాలువల్లో పూడికతీత, మరమ్మతులకు దాదాపు రూ.6 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఆయా పనులకు టెండర్లకు ఆహ్వానించారు. ఈ నెల 11వ తేదీ వరకు టెండర్ల గడువు ఉంది. కానీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకముందే టీడీపీ నేతలు ఆయా పనులను ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనలను కాలరాసి యంత్రాలతో కాలువ పూడిక తీత పనులను మమ అనిపిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా పనులు చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయా కాలువలకు సాగునీరు వదిలే అవకాశం ఉండడంతో పనుల నాణ్యత పరిశీలించే అవకాశం కూడా ఉండదనే కారణంతో హడావుడిగా పనులు చేసినట్లు చూపి నిధులు ఆరగించే ప్రయత్నాలు మమ్మురం చేశారు. ఇరిగేషన్‌ అధికారులతో కుమ్మకై ్క గుట్టు చప్పుడు కాకుండా పనులు చేస్తున్న విషయం మాజీమంత్రి కాకాణి దృష్టికి రావడంతో ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. పలు పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారులు మిన్నకుండిపోయారు.

ఇసుక తవ్వకాలకు గిరిజనుడు బలి

సంగం ఆనకట్ట సమీపంలో పొదలకూరు మండలం సూరాయపాళెం వద్ద టీడీపీ నేతల ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతలో పడి రెండు రోజుల క్రితం ఓ గిరిజనుడు మృత్యువు పాలయ్యాడు. ఆ గిరిజన కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని, పొదలకూరు మండలంలోని కనుపూరు కాలువ పనులు పరిశీలించాలని కాకాణి సిద్ధపడ్డారు. ఆయన అక్కడికి వెళ్తే తమ అవినీతి రంగు ఎక్కడ బయట పడుతుందోనని టీడీపీ నేతలు భయపడ్డారు.

తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము సోమిరెడ్డిని అడ్డుకుని ఉంటే అల్లీపురం నుంచి కూడా బయటకు రాలేపోయేవాడు. తాను కాలువ సందర్శనకు వెళ్లానంటే సోమిరెడ్డి అవినీతి ఎక్కడ బహిర్గతం అవుతుందోనని భయపడి పోలీసులను పురమాయించాడు. నన్ను పోలీసులను అడ్డు పెట్టుకుని అడ్డుకున్నా.. సోమిరెడ్డి అవినీతిపై తన పోరాటం ఆగదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కాకాణిని నెల్లూరులోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ సోమిరెడ్డి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రూ.కోట్లు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కాలువల పనులకు సంబంధించి ఈ నెల 11వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు గడువు ఉన్నప్పటికీ ముందుగానే పనులు ప్రారంభించి నామమాత్రంగా చేస్తూ రూ.కోట్లు కొల్లగొట్టడానికి వేసిన స్కెచ్‌ను అడ్డుకునేందుకు కాలువ సందర్శించడానికి వెళ్లాలంటే పోలీసుల అనుమతి అవసరమా అని ప్రశ్నించారు. డ్రెడ్జింగ్‌ కోసం తీసిన గుంతలో పడి అమాయక గిరిజనుడు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సోమిరెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఆపుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు టీడీపీ నేతలకు తొత్తులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకాణి వెంట ఎవరైనా వెళ్తే 307 సెక్షన్‌ కింద కేసులు పెడతామని పోలీసులు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని చెప్పారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే పరిశీలించేందుకు వెళ్లాలనుకుంటే పోలీసులు అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. ఎవరి బలం ఏమిటో తాము అక్కడే తేల్చుకుంటామని, టీడీపీని ప్రజాబలంతో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకుని సోమిరెడ్డి దోపిడీ ప్రజలకు తెలియజెప్పడానికి బయలుదేరుతున్న తమను అడ్డుకోవడంతోనే కూటమి ప్రభుత్వ నైజం బయటపడిందన్నారు. సోమిరెడ్డి అవినీతిపై పోరాటం కొనసాగుతుంది తప్ప వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

సోమిరెడ్డి అవినీతిపై పోరాటం ఆగదు

మాజీ మంత్రి కాకాణి

No comments yet. Be the first to comment!
Add a comment
టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం 1
1/4

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం 2
2/4

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం 3
3/4

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం 4
4/4

టీడీపీ నేతల అవినీతి బయటపడుతుందని కాకాణి గృహ నిర్బంధం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement