ఉదయగిరి: ఉదయగిరి ఉపఖజానా కార్యాలయం రికార్డులను ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం వరకు నిశితంగా తనిఖీ చేశారు. ఎస్టీఓ సీహెచ్ మమత మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేపథ్యంలో పెండింగ్ రికార్డులతో పాటు పాస్ చేసిన బిల్లుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్టీఓను నెల్లూరు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దాదాపు పది మంది ఏసీబీ అధికారులు 14 గంటల పాటు రికార్డులు పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. పలు విషయాలకు సంబంధించి ఎస్టీఓను ఏసీబీ డీఎస్పీ శిరీష పూర్తి స్థాయిలో విచారణ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment