పెంచలయ్య మృతదేహానికి అంత్యక్రియలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గుండెపోటుతో మృతిచెందిన దేవుళ్ల పెంచలయ్య అంత్యక్రియలకు కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. అంత్యక్రియలు చేసేందుకు డబ్బుల్లేకపోవడంతో వెంకటేశ్వరపురంలోని ఫ్లై ఓవర్ కింద మృతదేహాన్ని పెట్టుకుని తల్లి వెంకమ్మ, భార్య రాజేశ్వరి బుధవారం రాత్రి నుంచి కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న వైనంపై గురువారం సాక్షి పత్రికలో ‘మానవత్వమా.. నీ జాడెక్కడ?’ అనే శీర్షికపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. ఆయన ఆదేశాలతో శానిటరీ సూపర్వైజర్ నరసింహారావు, వార్డు అడ్మిన్ చైతన్య, శానిటరీ సెక్రటరీలు లీలావతి, కార్తీక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పెంచలయ్య అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌వర్మ అనే వ్యక్తి ఆ కుటుంబానికి రూ.5,500ను అడ్మిన్ చైతన్య చేతుల మీదుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment